మహారాష్ట్రలో ఘోరప్రమాదం: ఐదుగురు స్పాట్ డెడ్
వార్ధా: మహారాష్ట్రలోని(Maharashtra) సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) సంభవించింది. వార్ధా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మరణించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదం విరుల్ గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. దీనివల్ల ముంబై-నాగ్‌పూర్ సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై(Mumbai-Nagpur Samruddhi Expressway) ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఎథనాల్‌ను తరలిస్తున్న ఒక కంటైనర్ ట్రక్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న ఇంటర్‌ఛేంజ్ (IC 80) సమీపంలో బోల్తా పడటంతో, ముంబై నుంచి నాగ్‌పూర్ వైపు వెళ్లే ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఆ తర్వాత, అదే ప్రదేశంలో ఒక ట్రక్ కారు వెనుక భాగాన్ని ఢీకొట్టిందని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.






