గొట్టిపర్తిలో భార్యను హత్య చేసి,భర్త ఆత్మహత్య
తుంగతుర్తి, జులై 9 : భార్యను ఇనపరాడుతూ హత్య చేసి తాను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన కోట సత్యనారాయణ (66) అతని భార్య అయిన కనక లక్ష్మీ (63 ) గొట్టిపర్తి గ్రామానికి చెందిన కోట సత్యనారాయణ కనక లక్ష్మి దంపతులు అల్లం, ఎల్లిగడ్డ వ్యాపారం చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు.అల్లం, ఎల్లిగడ్డ వ్యాపారం చేసి సంపాదించిన సొమ్ములో బిడ్డకు పెడుతున్నాడని ఆయన భావించి, తరచూ తగాదా పడుతున్నారు ఈ విషయమై ఆమె భర్త చేసే వేధింపులు భరించలేక పెద్ద కుమారుడి దగ్గరకు వెళ్ళింది .
ఇటీవల పెద్ద మనుషులందరూ కలిసి ఆమెను గ్రామానికి తీసుకొచ్చి ఇంట్లో ఉంచారు. వచ్చిన నాటి నుండి ఇద్దరు మధ్య తరచూ పంచాయతీ జరుగుతూనే ఉంది. తాజాగా బుధవారం రాత్రి కూడా ఇద్దరు మధ్య పంచాయతీ జరగటంతో కొడుకులకు ఫోన్ చేసింది .వారు కూడా కాన్ఫరెన్స్ లో మాట్లాడి మీరు పంచాయతీ పెట్టుకోవద్దు .మేము వస్తాము అని చెప్పారు. బుధవారం రాత్రి ఆమె చంపడానికి నిర్ణయించుకున్నాడు. ఇంట్లోనే ఆమెను తలపై కొట్టి చంపాడు.
అనంతరం ఆయన మరణ వాంగ్మూలం రాసి ఇంట్లో ఉన్న సంతకలో, నాలుగు లక్షల 90 వేలకు చెందిన అప్పు పత్రాలు ఉన్నాయని, రూ.9 వేలు నగదు ఉందని ఆ సొమ్మును ఇద్దరు కొడుకులు సమానం తీసుకోవాలని గొడవ పెట్టుకోవద్దని వాంగ్మూలం రాసి దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం గమనించిన చుట్టుపక్కల వారు కొడుకులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సందర్శించి శవాలకు పంచనామా నిర్వహించారు. విషయం తెలవగానే సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ గ్రామానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఈ విషయమై కొడుకు కృష్ణ ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.






