21 July, 2026 | 5:18 AM

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు

20-07-2026 12:32 PM

పాల్వంచ (విజయక్రాంతి): పాల్వంచ మండలం లక్ష్మిదేవిపల్లి(ఉల్వనూరు)గ్రామ పంచాయతిలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల( Indiramma houses) గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ఎర్రంశెట్టి ముత్తయ్య, మాజీ మండల అధ్యక్షులు కొండం వెంకన్నలు  పాల్గొని ప్రారంభోత్సవాలు చేసి గృహస్తులను,ఆశీర్వదించి నూతన వస్త్రాలు బహుకరించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లులేని ప్రతి బీదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే ప్రదాన లక్ష్యంగా ముందుకెళ్ళుతున్న మన ముఖ్య మంత్రి  రెవంతరెడ్డి ,మన రాష్ట గృహనిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ల నేతృత్వంలో  సంక్షేమ పథకాలు అమలు సాధ్యమౌతాయన్నారు. సర్ ఫోగ్రాంలో కాంగ్రేస్ నాయకులు,కార్యకర్తలు చురుకుగా పాల్గొని ఏ ఒక్క ఓటు పోకుండా ఫారాలు నింపి బి. యల్. ఓ లకు అందజేసే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ వజ్జ లలిత, ఉప సర్పంచ్ రాపోలు రాంబాబు,గ్రామ సెక్రెటరీ పరుషురామ్,గ్రామ పెద్దలు వజ్జ నరేష్  తదితరులు పాల్గొన్నారు.