21 July, 2026 | 5:18 AM

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

20-07-2026 12:31 PM

ముకరంపుర, జూలై 20(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 20వ డివిజన్‌లో  రూ.70 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్  మాట్లాడుతూ, నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ పాలకవర్గ ప్రధాన లక్ష్యమని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి డివిజన్‌కు సమాన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

నగర అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ , డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ పర్వతం మల్లేశం,19వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి కృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఇతర కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.