21 July, 2026 | 5:18 AM

ఘనంగా ప్రారంభమైన లక్ష్ ఫౌండేషన్ హాస్పిటల్

20-07-2026 12:34 PM

మానవ సేవే మా ధ్యేయం – కేవలం ₹50తో వైద్య సేవలు

కరీంనగర్, క్రైమ్ జూలై 20 (విజయక్రాంతి): ప్రస్తుత కాలంలో వైద్య చికిత్సలు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రిలో ఔట్‌పేషెంట్ (ఓపి) ఫీజు కేవలం ₹50 మాత్రమేగా నిర్ణయించారు. ఈ సందర్భంగా డా. మొహమ్మద్ ముస్తాక్ అలీ మాట్లాడుతూ, ఈ ఆసుపత్రి లాభాపేక్షతో కాకుండా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రారంభించబడిందని తెలిపారు. సమాజానికి సేవ చేయడమే నిజమైన విజయమని, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్, కార్పొరేటర్ జమ్ము, కో-కార్పొరేటర్ ఇక్రామ్, కార్పొరేటర్ నవీన్, ముఫ్తీ సాదిక్ సాహెబ్, మొహమ్మద్ అలీ, అక్రమ్ అలీ, ఫజల్ ఉద్దీన్ బషీర్, ఫైసల్, జమాత్-ఎ-ఇస్లామీ హింద్ (జె ఐ హెచ్) అధ్యక్షుడు సోహైబ్, అజ్హర్ దబీర్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బా సామి సాహెబ్, తదితర ప్రముఖులు, సామాజిక సేవకులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొని తమ శుభాకాంక్షలు తెలిపారు.

లక్ష్ ఫౌండేషన్ గత అనేక సంవత్సరాలుగా సామాజిక సేవలో విశేష కృషి చేస్తోంది. కొరుట్లలో ఉచిత గ్రంథాలయం ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకోవడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ఉద్యోగ మేళాలు నిర్వహించడం, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వేలాది మందికి సేవలందిస్తోంది. కేవలం ₹50తో వైద్య సేవలు అందిస్తున్న లక్ష్ ఫౌండేషన్ హాస్పిటల్ కరీంనగర్ ప్రజలకు ఒక వరంగా నిలవాలని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.