ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి
మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్ అర్బన్, జూలై 29 : నగరం లో నిర్మిస్తున్న 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కార్యాలయాన్ని అనువైన వేరే భవనం లోకి షిఫ్టింగ్ పై కలెక్టర్ చర్చించారు. డాకర్ల,విద్యార్థుల,
రోగుల పార్కింగ్ కు,పక్కన గార్డెనింగ్,మెయిన్ రోడ్డు నుండి అప్రోచ్ రోడ్డు తదితర పెండింగ్ పనులు పూర్తి చేసి రెండు నెలల్లో ఆసుపత్రి ప్రారంభం కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని,జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ డా.రంగా అజ్మీరా,తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ డి.ఈ.ఈ వేణుగోపాల్, తదితరులు ఉన్నారు.






