బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
30-07-2026 01:41 AM
నాగిరెడ్డిపేట్, జూలై 29 (విజయక్రాంతి): మండలంలోని నాగిరెడ్డిపేట మండల మాజీ ఎంపీటీసీ సంతోష్ గౌడ్ సోదరుడు పక్షం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని నాయకుల ద్వారా తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాజీ ఎంపిటిసి సంతోష్ గౌడ్ నివాసానికి వెళ్లి పమర్శించడం జరిగింది.
మనోధర్యంతో ఉండి ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య,ప్రధాన కార్యదర్శి మంగలి యాదగిరి, గోపాల్పేట్,వాడి గ్రామాల సర్పంచ్లు కృష్ణ గౌడ్, మహేందర్, మాల్తుమ్మెద సొసైటీ మాజీ చైర్మన్ రాజిరెడ్డి,నాయకులు శ్రీనివాస్ గౌడ్,గడ్డం అశోక్ తదితరులు ఉన్నారు.






