తట్టేపల్లి వద్ద ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
భార్య, భర్త, కూతురు ముగ్గురు స్పాట్ డెడ్.
తల్లి శవం వద్ద రోదిస్తున్న కుమారుడు.
తాండూరు, ఏప్రిల్ 13,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దేముల్ మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం స్కూటీ పై నేడు తెల్లవారుజామున జహీరాబాద్ వెళ్లేందుకు బయలుదేరారు. అయితే తట్టేపల్లి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో స్పాట్ లోనే భార్య పావని (29) భర్త కవిరాజ్ (40) కూతురు కీర్తన(11) మృతి చెందారు. చిన్నారి బాలుడు కార్తీక్ తల్లి శవం వద్ద రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఘటన స్థలానికి పెద్దముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ చేరుకుని గాయాలైన బాలుడిని తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




