13 April, 2026 | 12:10 PM

Breaking News

వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •  

పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం

13-04-2026 10:18 AM

యతిన్ ట్రస్ట్ అధినేత మెగావత్ రవి

వెల్దుర్తి,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు సేవ చేయడమైన లక్ష్యం అని యతిన్ ట్రస్ట్ అధ్యక్షుడు మెగావత్ రవి అన్నారు. ఆదివారం  వెల్దుర్తి మండలం మెల్లూరు, పెద్దాపూర్, గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపులో మెల్లూరు, పెద్దాపూర్, గ్రామస్తులకు సుమారు 300 మందికి బీపీ షుగర్ పరీక్షలు అలాగే వారికి అవసరమగు మందులు కూడా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యతిన్ ట్రస్ట్ అధ్యక్షుడు మెగా వత్ రవి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు సేవ చేయడమైన లక్ష్యం అని ఈ ట్రస్టు 2023 వ సంవత్సరం నుండి ప్రారంభించామని ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ క్యాంపు ద్వారా అలాగే నిరుపేదల మహిళకు విద్యాపరంగా, అలాగే వారికి పెళ్లి కానుకగా పుస్తే మట్టెలు, అనాధ పిల్లలకు హాస్టల్లో చేర్పించడం అలాగే వారికి అయ్యే ఖర్చులు భరించడం  వీటితో పాటుగా నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలిపారు. మూడు సంవత్సరాల నుంచి సుమారుగా 20 లక్షల రూపాయల వరకు నిరుపేద కుటుంబాలకు ఖర్చు చేశానని కూడా తెలిపారు.

అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం కూడా సహాయం అందజేస్తానని వారు తెలిపారు. తను మెదక్ జిల్లా వాసున్నని శివంపేట మండలం లింగోజిగూడ తండా చెందిన వాడినని ప్రతి ఆదివారం జిల్లాలోని ఏదో గ్రామాన్ని తీసుకొని నిరుపేదలకు సేవ చేయడమే నా లక్ష్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యతిన్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.