లక్ష్మీ నారాయణపూర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం
ఏఆర్ కానిస్టేబుల్ స్పాట్ డెడ్.
కాంట్రాక్టర్ ,అధికారులనిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం.
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్ సమీపంలో (నేడు) సోమవారం తెల్లవారుజామున ఏ ఆర్ కానిస్టేబుల్ నర్సింలు (30) భావికీభద్రేశ్వర జాతర బందోబస్తు విధుల్లో చేరేందుకు తెల్లవారుజామున స్వగ్రామం బషీరాబాద్ మండలం రెడ్డి ఘనపూర్ నుండిబైక్ పై బయలుదేరాడు. ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ లోకి బైకు తో సహా పడిపోయాడు. దీంతో ఇనుప చువ్వలు శరీరంలోకి చొచ్చుకపోయి తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే జాతీయ రహదారి నిర్మిస్తున్న కాంట్రాక్టర్ జాగ్రత్తలు పాటించడం లేదని. .పనులు జరిగే చోట ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని అంటున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లే ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆరోపిస్తున్నారు.




