5 August, 2026 | 1:53 AM

నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

05-08-2026 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతేకాకుండా 30-40 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీస్తాయని తెలిపింది.

ఇక మంగళవారం నిర్మల్, సంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, జగిత్యాల్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురువగా, మిగిలిన జిల్లాల్లో మాత్రం లేలికపాటి వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది.