5 August, 2026 | 12:57 AM

న్యాయవాది హత్యపై ఆందోళన

05-08-2026 12:00 AM

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

వేములవాడ, ఆగస్టు 4, (విజయ క్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్కు చెందిన న్యాయవాది మల్లయ్య హత్యను నిరసిస్తూ వేములవాడ బార్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం కోర్టు విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్ ఆధ్వర్యంలో కోర్టు ప్రధాన ద్వారం వద్ద నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా పిట్టల మనోహర్ మాట్లాడుతూ న్యాయవాది హత్య కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారించి నిందితులకు త్వరితగతిన కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.నిరసనలో మాజీ అధ్యక్షులు పొత్తూరు అనిల్కుమార్, గుండ రవి, పెంట రాజు, న్యాయవాదులు రేగుల దేవేందర్, పర్లపెల్లి అంజయ్య, నక్క దివాకర్, మాదాసు దేవయ్య, జెట్టి శేఖర్, కనికరపు శ్రీనివాస్, గుజ్జే మనోహర్, నేదూరి అభిలాష్, బీమా మహేష్బాబు, ఒద్యారపు వేణుకుమార్, వడ్లకొండ శ్రీకాంత్, పొత్తూరు మల్లేశం, వంగ పర్శరాములు, గోపు మధు తదితరులు పాల్గొన్నారు.