సాంక్టస్ గ్రూప్ చైర్మన్‌కు ‘యంగ్ ఎడ్యూప్రెన్యూర్’ ప్రదానం
రాజేశ్వర్‌రెడ్డికి అవార్డు అందజేసిన నటుడు సోనూసూద్
వరుసగా నాలుగో ఏడాది ఎకనామిక్ టైమ్స్ గుర్తింపు
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ది ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ తెలంగాణ 2026 అవార్డ్స్ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ఠ ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలను సత్కరించారు. ఈ సందర్భంగా విద్యా విభాగంలో సాంక్టస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి. రాజేశ్వర్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక యంగ్ ఎడ్యూప్రెన్యూర్ అవార్డు ప్రదానం చేశారు. విశేషంగా, ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌లో ఆయన వరుసగా నాలుగో ఏడాది ఈ గౌరవాన్ని అందుకోవడం మరో విశిష్ఠ ఘనతగా నిలిచింది.
హైదరాబాద్‌లోని నోవోటెల్, హైటెక్ సిటీలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు సోనూ సూద్ చేతుల మీదుగా డి. రాజేశ్వర్ రెడ్డి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. అవార్డు స్వీకరించిన అనంతరం డి. రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికీ అంకితం చేస్తున్నట్లు తెలిపారు. వారి విశ్వాసం, నిబద్ధత, సహకారమే ఈ గుర్తింపుకు బలమని పేర్కొన్నారు. ఈ అవార్డు విద్యారంగంలో మరింత నాణ్యమైన అవకాశాలను సృష్టిస్తూ, విద్యా ప్రగతికి అంకితభావంతో ముందుకు సాగేందుకు మరింత ప్రేరణనిస్తుందని అన్నారు.






