7 March, 2026 | 6:20 AM

మాతృమూర్తి ప్రేమలో అతడు

07-03-2026 02:07 AM

బుచ్చయ్య సేవా కార్యక్రమాలు తల్లి లింగమ్మగారికి ఇష్టమైనవి. ప్రజాసేవలోనే జీవితం ధన్యమవుతుందని ఆమె అభిప్రాయం. లేకపోతే తన ఆస్తిని అమ్మి అచ్చుయంత్రాన్ని ఎందుకు కొంటుంది? అంతేకాదు, తాను స్వయంగా ప్రింటింగ్ పనులు చేయగలిగిన సామర్థ్యాన్ని సంపాదించింది. పనిలో దైవముందని ఆమె విశ్వాసం. ఆ తల్లి ఉద్దేశాన్ని అనుసరించి బుచ్చయ్య ‘ప్రసన్న ప్రింటర్స్’అనే పేరుపెట్టి, సేవా దృక్పథంతో అచ్చుయంత్రాన్ని నడపడం విశేషం.

ఇమ్మడి బుచ్చయ్య నాకు నల్గొండలో పరిచయమయ్యాడు. అక్కడ జరిగిన గ్రంథావిష్కరణ కార్యక్రమానికి అతడే సం యోజకుడు. అప్పుడు అతడు నాకిచ్చిన పుసక్తం పేరు ‘అమ్మతో నేను’. ఆ పుస్తకం చదివితే నాకు విచిత్రమనిపించింది. బుచ్చయ్యగారి దృష్టిలో అమ్మ అంటే అమృతం, విశ్వజనీన కావ్యం. ఆ పుస్తకాన్ని చదివినప్పుడు నాకు తైత్తిరీయోపనిషత్తులోని ‘మా తృదేవోభవ’ అనే పంక్తి వెంటనే గుర్తుకువచ్చింది. లోకాన్ని గమనించినప్పుడు అందరి లాంటిదే అమ్మ అనే అభి ప్రాయం ఉంది.

పిల్లల పెంపకం విషయంలోనే కాక, పంపకం విషయంలో అమ్మ ఆచితూచి అడుగు వేస్తుంది. అమ్మ దృష్టి లో పిల్లలందరూ సమానమే. కానీ, పిల్లల దృష్టిలో అమ్మ ఒక చిత్తు కాగితం, ఒక డస్ట్‌బిన్. సమాజం ఎందుకు అమ్మ విషయం లో ఇలా వ్యవహరిస్తుందో మనస్తత్వ శాస్త్రవేత్తలు తప్పక చెప్పవలసి ఉంది. ఆధునికపు పోకడలు పిల్లల్ని తల్లిదండ్రులకు దూరం చేస్తున్నా యి. ఎప్పుడూ పిల్లల్ని అంటిపెట్టుకొని ఉండే తల్లిని లేదా తండ్రిని పిల్లలు పెద్దవారు కాగానే అంటీముట్టకుండా ఉంటున్నారు. పూర్వం వానప్రస్థాశ్రమాలు ఉండేవి. 

వృద్ధులక్కడ ప్రశాంతంగా జీవించడానికి వారి సంతానం తగిన వ్యవస్థను ఏర్పాటు చేసేవారు. ఈరోజు వానప్రస్థానములు లేవు, వాటి స్థానంలో వృద్ధాశ్ర మాలు, అనాథాశ్రమాలు వెలిశాయి. పూర్వకాలం నుంచి కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ వచ్చినవారు తల్లిదండ్రులే. కానీ, పిల్లలు పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేస్తూ, పెద్దగా సంపాదిస్తూ పెద్దవాళ్లైపోయారు. వారి తల్లిదండ్రులు పేదవాళ్లైపోయారు. బుచ్చయ్య గారి పుస్త కం చదివిన తర్వాత ఈ కాలంలోనే అమ్మ ను గౌరవించే పిల్లలు ఉన్నారా? అనే ప్రశ్న ఉద్భవించింది. అంతేకాదు, అమ్మ ప్రేమ ను ఆసాంతం పొందడానికి ప్రయత్నించే కొడుకులున్నారా? అనే సందేహం కూడా కలిగింది. బుచ్చయ్య మహబూబ్‌నగర్ జిల్లాలో జాజాల అనే చిన్న గ్రామంలో జన్మించాడు.

ఆ గ్రామంలో అతడు పుట్ట డం వల్ల అతనికి జేజేలు చెప్పాలనిపిస్తుం ది. బుచ్చయ్య అమ్మ చేతుల మీద పెరిగాడు. అమ్మంటే అతనికి ప్రాణం. అమ్మ అంటూ ధ్యానం. అమ్మనే సర్వస్వం. అంతమాత్రాన భార్యాపిల్లల్ని చూడడని అంటా నికి వీలు లేదు. బుచ్చయ్య అమ్మప్రేమను పొందడానికి అతని భార్య అడ్డంకి కాలేదు. ఆమె నిజంగా సహధర్మచారిణి! నా అభిప్రాయం ప్రకారం లోకంలో అమ్మనాన్నల ను బాగా చూసినవారే అదృష్టవంతులు. అమ్మ అనురాగాన్ని పొందినవారే భాగ్యవంతులు. అమ్మనాన్నాల ఆశీర్వాదం అం దుకున్నవారే ఆయుష్మంతులు, నిజమైన అభివృద్ధిని పొందగలిగినవారు. కన్నతల్లి ప్రేమను నూటికి నూరుపాళ్లు పొందడమంటే కష్టమే.

కానీ, బుచ్చయ్య అమ్మప్రే మను సంపూర్ణంగా సంపాదించగలిగాడు. అతని కన్నతల్లి కూడా బుచ్చయ్యను ఎం తో అభిమానించింది. వారి కుటుంబానికి అమ్మే రక్షకవచంగా మారింది. తండ్రి చనిపోయినా, తల్లి లింగమ్మ తండ్రి ప్రేమను, తన ప్రేమతో కలిపి తన కుమారునికి అందించింది. లింగమ్మ పూర్వజన్మ పుణ్యఫలమే బుచ్చయ్య తన కుమారుడిగా జన్మించడం. బుచ్చయ్య కూడా అలాంటి తల్లికి కొడుకు కావడం అదృష్టమనాలి.

వేదం మనకిచ్చే సందేశం గొప్పది. పిల్లల్ని తల్లిదండ్రులను, గురువులను, అతిథులను దేవతలుగా భావించమంటుంది. భగవంతుడే తల్లిదండ్రులకు సంతానాన్ని ఇచ్చినట్లే, సంతానానికి తల్లిదండ్రులనిస్తా డు. అమ్మ ఋణం తీరనిది. దీన్నే శాస్త్రం మాతౄణం అంటుంది. బుచ్చయ్య తన తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. లింగమయ్య కూడా కుమారునికి అన్నివిధాలా తోడ్పడుతూ అతని పురోవృద్ధికి బాటలు వేసింది.

బుచ్చయ్యకు అచ్చుయంత్రాన్ని నడిపించే పని అప్పజెప్పింది అతని తల్లిగారే. ఆశ్చర్యకరమైన విషయం ఏమం టే ఆమె స్వయంగా అచ్చుయంత్రాన్ని నడిపించగలుగుతుంది. వంట పనిలో కోడ లిని నియమించి కుమారునికి అచ్చయంత్రం నడపడంలో సహాయపడడం గొప్ప విషయం! బుచ్చయ్య సేవా కార్యక్రమాలు తల్లి లింగమ్మగారికి ఇష్టమైనవి. ప్రజాసేవలోనే జీవితం ధన్యమవుతుందని ఆమె అభిప్రాయం. లేకపోతే తన ఆస్తిని అమ్మి అచ్చుయంత్రాన్ని ఎందుకు కొం టుంది? అంతేకాదు, తాను స్వయంగా ప్రింటింగ్ పనులు చేయగలిగిన సామర్థ్యాన్ని సంపాదించింది.

పనిలో దైవముందని ఆమె విశ్వాసం. ప్రసన్నమైన మనసు గల ఆ తల్లి ఉద్దేశాన్ని అనుసరించి బుచ్చ య్య ‘ప్రసన్న ప్రింటర్స్’అనే పేరుపెట్టి, సేవా దృక్పథంతో అచ్చుయంత్రాన్ని నడపడం విశేషం. కన్నతల్లి ఆశీర్వాద బలం చేతనే అంచెలంచెలుగా ఎదిగిన బుచ్చయ్య లైన్స్ క్లబ్ అధ్యక్షులుగా సంతోష్‌నగర్ ప్రాంతంలో మంచి పేరు సంపాదించుకున్నారు. విద్యార్థులకు పుస్తకవితరణ, నేత్ర దానం, రక్తదానం మొదలైన కార్యక్రమా ల్లో బుచ్చయ్య పాల్గొని అందరి చేత ‘భేష్’ అనిపించుకున్నాడు. 

అమ్మ ఆశీర్వాదాన్ని భగవదాశీర్వాదంగా భావించే బుచ్చయ్య తన తల్లిమీద ఈగ వాలనివ్వడు. నిత్యం తల్లి పాదాలకు నమస్కరించడం, తల్లి చెప్పినట్లు నడవడం, తల్లి ఆరోగ్యాన్ని కాపాడడం బుచ్చ య్యకు చాలా ఇష్టమైన పనులు. మాతృమూర్తి స్థానం చాలా గొప్పది. మాతృ మూర్తి లభిస్తే గానీ, మనం మాట్లా డే భాష మాతృభాష అయ్యింది, మనం పుట్టి న నేల మాతృదేశమయ్యింది.

మాతృగౌరవం అన్ని గౌరవాలకన్నా మిన్న. బుచ్చ య్యను ఒకసారి నేను ‘బాగున్నారా బుచ్చయ్యగారు’ అని ప్రశ్నించాను. ‘మా అమ్మ అనుగ్రహం వల్ల బాగున్నాను’ అని సమాధానమిచ్చాడు. మనం సాధారణంగా దేవుని అనుగ్రహం వల్ల బాగు న్నాం అం టాం. తన అమ్మలో ప్రత్యక్షంగా దైవాన్ని చూసే బుచ్చయ్య ప్రతి ఒక్కరికి ఆదర్శమని చెప్పగలను.

 సెల్ :9885654381

-ఆచార్య మసన చెన్నప్ప