24 May, 2026 | 2:03 AM

లేహ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్

24-05-2026 12:56 AM

సాంకేతిక వైఫల్యాలే కారణం

పైలెట్లు, మేజర్ జనరల్ సచిన్ క్షేమం

శ్రీనగర్, మే 23: భారత్ సరిహద్దు లద్దాఖ్‌లోని లేహ్ పర్వత ప్రాంతాల్లో చీతా ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. లెఫ్టినెంట్ కల్నల్, ఇద్దరు పైలెట్లు ఇందులో ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఒక్కసారిగా హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురు స్వల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించారు.

అయితే ఈ ఘటన మే 20న జరగగా శనివారం వెలుగులోకి వచ్చింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రమా దం అనంతరం మిగిలిన ఇద్దరితో కలిసి మేజర్ జనరల్ సచిన్ మెహతా తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత సైన్యం, వాయుసేనలో దశాబ్దాలుగా చీతా, చేతక్ హెలికాప్టర్లను వినియోగిస్తోంది. వీటిలో సరైన సాంకేతికత లేకపోవడం వల్ల ప్రమాదానికి గురవుతున్నాయి. దీంతో వీటిని కొత్త టెక్నాలజీ హెలికాప్టర్లతో భర్తీ చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.