ఉద్యోగాలపై సీఎం చెప్పేవి కాకి లేక్కలే.. బడ్జెట్ పత్రాలు అందుకే చింపాం..!
బడ్జెట్ పత్రాలు అందుకే చింపాం.. మీడియా సమావేశంలో చెప్పిన హరీశ్ రావు
హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీ మీడియా హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao Press Meet) సంచలన వ్యాఖ్యలు చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. రాష్ట్ర బడ్జెట్ డొల్ల, బడ్జెట్ లో ఆరు గ్యారంటీల హామీ లేనందునే పత్రాలు చింపామని వివరించారు. కోటి మంది మహిళలకు నెలనెలా రూ. 2500 ఇస్తామన్నారు. ప్రభుత్వ మోసాన్ని తెలిపేందుకు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపామన్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు.
కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని వెనక్కి తగ్గారని, నీటిపారుదలశాఖ పద్దుపై చర్చ సమయంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేశారని ద్వజమెత్తారు. కాంగ్రెస్ వచ్చాక ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగాలపై నిలదీశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ వచ్చాక 16 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు సభలో ప్రభుత్వమే చెప్పిందన్న హరీశ్ రావు 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు సీఎం చెప్పేవి కాకి లేక్కలే అన్నారు.
శాసనసభలో సీఎం పహల్వాన్ భాష మాట్లాడారు.. కత్తుల కోలాటంలో తలలు తీస్తామంటే ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయలేదని చెప్పారు. శాసనసభలో సీఎ అనాగరిక భాషపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయలేదని, ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రధాన్యం ఇచ్చామని వివరించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తమ పోరాటం కొనసాగుతోందని హరీశ్ రావు పేర్కొన్నారు.




