17 June, 2026 | 2:18 AM

సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్‌ఓసీ అందజేత

17-06-2026 12:00 AM

నాగోల్, జూన్ 16 (విజయక్రాంతి): మన్సూరాబాద్ డివిజన్కు చెందిన అనిల్ కుమార్ జైస్వాల్కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.2 లక్షల విలువైన ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ను యువనాయకులు జక్కిడి సత్య తేజ రెడ్డి అందజేశారు.

అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిల్ కుమార్ జైస్వాల్ ఆర్థిక సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా ఈ సహాయం మంజూరైంది. లబ్ధిదారుడి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో కర్మన్ఘాట్ టెంపుల్ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, నాయకులు మున్నా, జానీ, విఠల్ రెడ్డి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.