ఎల్లాపురం గ్రామస్తులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలం ఇచ్చి తీరుతా..
ఎమ్మెల్యే పాయం హామీ
పినపాక, జూన్ 16, (విజయక్రాంతి): మండలంలోని పోట్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్లా పురం గ్రామస్థులు తమ సమస్యలు పై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ను కలిశారు. గత కొన్నేళ్లుగా ప్రమాదకరంగా మారిన పెద్ద వాగు పక్కన ఉంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని, ఏ క్షణంలో ఏ ప్రమాదం వస్తుందో తెలియక ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని మొర పెట్టుకున్నారు.
వారి సమస్యలు, పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని ఎల్లాపురం గ్రామస్థులను అక్కడి నుంచి ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతంలో ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయించి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం తో గ్రామస్థులు ఆనందం, హర్షం వ్యక్తం చేశారు. ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షుడు గొగ్గల రామకృష్ణ, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు కొమరం శ్రీను, సతీష్ పాల్గొన్నారు.






