15 June, 2026 | 2:21 AM

దేవుని సొమ్ముకే కక్కుర్తి

15-06-2026 01:14 AM
  1. పారుపల్లి మల్లికార్జున స్వామి గుడిలో దారుణమైన చోరీ
  2. పాపాత్ములారా.. దేవుని దయ కంటే మీ దురాశే ఎక్కువైందా?

ముత్తారం, జూన్ 14 (విజయ క్రాంతి)ముత్తారం మండలం పారుపల్లిలోని  శ్రీ ఆది మల్లికార్జున స్వామి ఆలయంలో జరిగిన చోరీ ఘటన, మనుషుల నైతిక పతనాన్ని మ రోసారి కళ్ళకు కట్టింది. భక్తితో భక్తులు సమర్పించుకున్న కానుకలను, దేవుని హుండీనే బద్దలుగొట్టి దొంగిలించిన ఆ దు ర్మార్గుల చర్యపై స్థానికంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.రాత్రిపూట చీకటిని ఆసరాగా చేసుకుని, పవిత్రమైన ఆలయంలోకి ప్రవేశించి ఈ నీచానికి ఒడిగట్టిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.

భక్తుల మనోభావాలతో ఆడుకుంటే.. పతనం తప్పదు

కేవలం పైసల కోసం భక్తుల విశ్వాసాలను, ఆలయ పవిత్రతను దెబ్బతీసే ఇలాంటి నీచమైన పనులకు పాల్పడే వారికి దైవశిక్ష తప్పదని, దేవుని సొమ్మును కాజేసిన ఈ పాపాత్ములకు ఏ మాత్రం భయం, భక్తి లేదన్నది స్పష్టమవుతోంది. అమాయక భక్తులు వేసిన చిల్లర పైసల మీద కూడా కన్ను పడిందంటే, మీ దౌర్భాగ్యపు బతుకులు ఏ స్థాయికి పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు‘ అని గ్రామస్థులు మండిపడుతున్నారు.

దొంగలకు హెచ్చరిక: దాగినా దొరుకుతారు!

కులపెద్దలు, భక్తులు ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు. చోరీకి పాల్పడిన ఆ ’నీచులు’ ఏ మూలన దాక్కున్నా సరే, గ్రామ ప్రజలు, పోలీసులు కలిసి వెతికి పట్టుకు తీరాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

డిమాండ్

పవిత్రమైన ఆలయాల్లో ఇలాంటి అరాచకాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే, ఈ దొంగలను వెంటనే పట్టుకుని, కఠినంగా శిక్షించాలని, చట్టం ముందు, సమాజం ముందు మీ నిజస్వరూపాలు బయటపడక తప్పదని,ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దొంగలను వెతికి పట్టుకునే వరకు భక్తులు నిద్రపోరని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.