12 August, 2026 | 4:47 PM

ఇల్లందులో ఘనంగా తిరంగా ర్యాలీ

12-08-2026 02:27 PM

ఇల్లందు టౌన్, ఆగస్టు 12 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇల్లందు మండలంలో మాస్టర్ మైండ్స్, సరస్వతి విద్యాలయం ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు భట్టు రమేష్ అధ్యక్షతన తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ సాగిన ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టు రమేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు ‘ముందు దేశం.. తర్వాతే మనం’ అనే భావనను యువతలో పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

ర్యాలీకి సహకరించిన విద్యాసంస్థల అధ్యాపక బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్, సరస్వతి విద్యాలయం అధ్యాపక బృందాలతో పాటు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోపీకృష్ణ, జిల్లా కార్యదర్శి మురళీకృష్ణ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రాంచందర్, మండల ప్రధాన కార్యదర్శులు రాజేష్, మధు, మండల ఉపాధ్యక్షులు శ్రీకాంత్, పవన్, వంశీ, బుచ్చయ్య, కృష్ణ, లక్ష్మీనర్సింహా తదితరులు పాల్గొన్నారు.