12 August, 2026 | 3:47 PM

చేయూత’ పింఛన్లకు దరఖాస్తులు చేసుకోండి

12-08-2026 02:26 PM

తాసిల్దార్ బాల లక్ష్మి

చేగుంట ఆగస్ట్ 12, విజయక్రాంతి: రాష్ట్రంలో ‘చేయూత’ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు ఈ నెల 15 నుంచి మండలం లొని ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని  చేగుంట తాసిల్దార్ బల్ లక్ష్మి తెలిపారు. మండలంలో ఉన్న ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, వికలాంగులు, దయాలసిస్ బాధితులు, థాలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులకు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. గ్రామాలలో లొ ఏటా 1.50 లక్షలు, పట్టణాల్లో 2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు అర్హులని, 3 ఎకరాల మెట్ట,5 ఎకరాల మాగాణి లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఈ నేల 31 వరకు  చివరి తేదీ అని, దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను  స్థానిక ఎంపీడీవో  కార్యాలయం సమర్పించాలని తెలిపారు. అనంతరం సెప్టెంబర్ ఒకటి తేదీ నుండి దరఖాస్తులను పరిశీలించి, అర్హులను గుర్తించి సంబంధిత జిల్లా అధికారులకు సమర్పిస్తామని తెలిపారు