12 August, 2026 | 3:47 PM

జియో సిగ్నల్ అంతరాయం లేకుండా చూడండి

12-08-2026 02:29 PM

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో గత మూడు నెలల కాలంగా జియో నెట్వర్క్ పనిచేయకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ జియో స్టోర్ ఇన్చార్జి గుమ్మల వెంకటరమణ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మూడు నెలల నుండి సిగ్నల్ సరిగా లేకపోవడంతో తాము రీచార్జ్ చేసుకున్న డబ్బులు వృధా అవుతున్నాయి అన్నారు. సమస్యను వారం రోజుల్లో పూర్తి చేయాలని లేకుంటే మండలంలో జియో సిమ్ కార్డులను పూర్తిగా విరమించుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎలుక రాజు, షేక్ మున్షిప్ ,సాయి, ప్రశాంత్, నాగేష్, భూమేష్ విజయ్ ముక్రం తదితరులు పాల్గొన్నారు.