21 April, 2026 | 4:44 AM

సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులు

21-04-2026 03:18 AM

కేసముద్రం, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): మెరుగైన సమాజానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులని, ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవప్రదమైనదని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. 40 సంవత్సరాలపాటు ఉపాధ్యాయ వృత్తి నిర్వహించి పదవి విరమణ చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయుడు చీకటి వెంకట్రాం నరసయ్య సన్మాన కార్యక్రమం కేసముద్రంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ 40 ఏళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి, అనేకమంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన వెంకట రామ నరసయ్య దంపతులు పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, వివిధ పార్టీల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పూర్వ విద్యార్థులు పాల్గొని వెంకట్రాం నర్సయ్య దంపతులను ఘనంగా సత్కరించారు.