28 June, 2026 | 1:54 AM

నిమ్స్‌కు ఆంబులెన్స్ విరాళం అభినందనీయం

28-06-2026 12:53 AM

నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్

పంజాగుట్ట, జూన్ 27 (విజయక్రాంతి): బంట్వాల్ లక్ష్మణ్ శాంత షెనోయ్ దంపతుల స్మారకార్థం వారి సంతానం నిమ్స్ హాస్పిటలుకు ఆంబులెన్స్ ను విరాళంగా ఇచ్చారు. ప్రకాశ్ షెనోయ్, ఉషా మాల్యా, అనీషా షెనోయ్, డాక్టర్  ప్రజ్ఞా రంగనాథ్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ సమక్షంలో రూ.30లక్షల విలువ చేసే ఆంబులెన్సును శనివారం అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య సేవలను బలోపేతం చేయడానికి దాతలు అందించిన సహకారం అమూల్యమైనదని అన్నారు.

ఇటువంటి విరాళాలు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందించేందుకు దోహదపడతాయన్నారు. బేసిక్ లైఫ్ సపోర్ట్ ఉన్న ఆంబులెన్స్ ను షెనోయ్ దంపతుల సంతానం విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డీన్ ప్రొఫెసర్ పి.చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ పరంజ్యోతి, సర్జికల్ అంకాలజీ విభాగాధిపతి రంగనాథ్, అసిస్టెంట్ సూపరిటిండెంట్లు డాక్టర్ రాకేశ్, డాక్టర్ చరణ్, మీడియా రిలేషన్స్ ఆఫీసర్ సత్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.