20 April, 2026 | 2:48 AM

స్టేట్ టాపర్ చోదిత గౌడ్‌కు ఘన సన్మానం

20-04-2026 12:47 AM

మాడ్గుల, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో సిఇసి  విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన బండారి చోదితను ఆదివారం తుర్కయంజాల్లో జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా అద్భుతాలు సాధించగలరని అనడానికి చోదిత నిదర్శనమని కొనియాడారు. తల్లిదండ్రులు బాలరాజు గౌడ్ గాయత్రి ల ఆశయాలను నెరవేరుస్తూ, రాష్ట్రస్థాయిలో మాల్ గోడుకొండ్ల గ్రామానికి, జిల్లాకు పేరు తెచ్చిన చోదిత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.