20 April, 2026 | 2:46 AM

శంకర్‌పల్లిలో ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు

20-04-2026 12:54 AM

శంకర్ పల్లి, ఏప్రిల్ 19 (విజయ క్రాంతి): శంకర్ పల్లి మున్సిపాలిటీ లో అరుణోదయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా సాగింది. మాజీ వార్డు సభ్యులు స్వర్గీయ బి. లక్ష్మీకాంత్ రెడ్డి జ్ఞాపకార్థం, స్థానిక ఏఎంసి వైస్ చైర్మన్ మరియు అరుణోదయ యూత్ క్లబ్ అధ్యక్షులు కాశెట్టి చంద్రమోహన్ నేతృత్వంలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు.

ఈ టోర్నమెంట్లో స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటారు. పోటీల అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ సాత ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు.  క్రీడాకారులను ప్రోత్సహించడంలో అరుణోదయ యూత్ క్లబ్ పాత్ర అభినందనీయ మని కొనియాడారు.   ఏఎంసి మాజీ చైర్మన్ ప్రకాష్ గుప్తా, క్లబ్ మాజీ అధ్యక్షులు బి. ప్రణీత్ (చిన్న), సటగళ్ల శ్రీధర్ గౌడ్, మోహన్ రెడ్డి, జూలకంటి పాండురంగారెడ్డి, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి, పార్శి బాలకృష్ణ  పాల్గొన్నారు.