రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్సకాని శరభేశ్వరరావుకు ఘన సన్మానం
04-07-2026 01:52 AM
కోదాడ, జూలై 3: రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూతనంగా నియమించబడిన అల్సకాని శరభేశ్వరరావును శుక్రవారం నల్లబండగూడెంలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో అల్సకాని శరభేశ్వరరావును సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముండ్రా రంగారావు , యరమాల బెంజిమెన్ , ముండ్ర శివరామకృష్ణ , ముండ్ర రామారావు , చిగురుపాటి సుధాకర్ , మాగంటి ముత్తయ్య , బోయల రమేష్ , యరమాల గురవయ్య , యరమాల నాగార్జున , ముండ్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.






