4 July, 2026 | 2:50 AM

సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు

04-07-2026 01:51 AM

సర్పంచ్ లూనావత్ కృష్ణా నాయక్ 

ఈనెల 7న సీత్ల పండుగ ఘనంగా నిర్వహణ

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి) జూలై 3: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మండలంలోని సూర్యనాయక్ తండా గ్రామంలో గురువారం ప్రధాన వీధులు, కాలనీలు, డ్రైనేజీలు, చెత్తనిల్వ ప్రాంతాలు,దోమలు అధికంగా వ్యాపించే ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్గున్యా, వైరల్ జ్వరాలు వంటి వ్యాధులను నివారించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ లూనావత్ కృష్ణ నాయక్ తెలిపారు.

అనంతరం గ్రామ పెద్దలతో నిర్వహించిన సమావేశంలో జూలై 7న జరిగే సీత్ల పండుగను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.గ్రామ ప్రజలు తమ ఇళ్లు,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పండుగను విజయవంతం చేయాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ కిషన్ నాయక్,వార్డు సభ్యులు బుజ్జీభద్రు నాయక్,బిక్కు నాయక్,నర్సింహా నాయక్,నాయకులు నందా, సోమాలి, రమేష్, భీమ్లా, నాగులు, అనిల్, రవి, సూర్య తదితరులు పాల్గొన్నారు.