27 April, 2026 | 2:16 AM

ఎమ్మెల్సీ కోదండరాంకు ఘన సన్మానం

27-04-2026 12:38 AM

రంగారెడ్డి, ఏప్రిల్ 26(విజయక్రాంతి): గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాంను ఆదివారం ఆమనగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండేకార్ యాదిలాల్, గ్రంథాలయ కార్యదర్శి గణేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో కోదండరాంకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోదండరాం సార్కు ఎమ్మెల్సీగా అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిష్టించాలని ఆకాంక్షించారు. అలాగే, విద్యావేత్త, ఉద్యమ నేత అయిన కోదండరాంను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.