బోనాలకు రావాలని ఎంపీ ఈటలకు ఆహ్వానం
03-08-2026 01:17 AM
ఉప్పల్ ఆగష్టు 2 విజయక్రాంతి నాచారం డివిజన్ హెచ్‌ఎంటీ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో గల శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయంలో వచ్చే ఆదివారం నిర్వహించనున్న బోనాల జాతరకు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బొల్లం చంద్రమౌళి ఆధ్వర్యంలో, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ సహకారంతో ఎంపీని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయం ముందు షెడ్డు ఏర్పాటు చేయాలని కోరగా, ఎంపీ సానుకూలంగా స్పందించి తన నిధుల నుంచి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.






