కార్మిక చట్ట సవరణలు కార్మిక వర్గానికి ప్రమాదకరం
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్
మంచిర్యాల, ఆగస్టు 2 (విజయక్రాంతి): కార్మిక చట్ట సవరణలు కార్మిక వర్గానికి ప్రమాదకరమని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. మంచిర్యాల జిల్లా 4వ మహాసభను ఉద్దేశించి ఏఐటియుసి మంచిర్యాల జిల్లా 4వ జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
భారతదేశంలో 54 కోట్ల మంది కార్మిక వర్గం మన దేశంలో ఉన్నారుని, వారిని నిర్లక్ష్యం చేస్తూ బిజెపి, ఎన్ డీ ఏ ప్రభుత్వం వంద సంవత్సరాల పోరాట, త్యాగాల ఫలితంగా సాధించుకున్న చట్టాలను కార్పొరేట్ సెక్టార్స్ కు, పెట్టుబడిదారులకు అనుకూలంగా మలిచి నాలుగు కోట్లు భారతదేశ కార్మిక వర్గం మీద తీసుకు వచ్చిందన్నారు. ఈ నాలుగు కోడ్లు బిజెపి ప్రభుత్వం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం జరుగుతుందంటే, బిజెపి దేశంలో ఉన్నటు వంటి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా వెళుతుందన్నారు.
దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష రాష్ట్రాలలో ఈ కోడ్లు అమలు చేయడం లేదనీ, మన తెలంగాణలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ కోడ్ లను అమలు చేయమని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ సర్కారు అంగన్వాడీ లకు రూ. 18 వేలు, మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ. 10 వేలు, అదేవిధంగా కనీస వేతనాలు రూ. 26 వేలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, కలవేన శంకర్, రామడుగు లక్ష్మణ్, వెంకటస్వామి, మేకల దాసు, అక్బర్ అలీ, కలిందర్ అలీ ఖాన్, పౌలు, సమ్మయ్య, సరస్వతీ, దాగం మల్లేష్, బాజీ సైదా, సలేంద్ర సత్యనారాయణ, జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.






