ముగిసిన మణిదీప్ అంత్యక్రియలు
03-08-2026 01:16 AM
- ఫిన్లాండ్ నుంచి స్వదేశానికి పార్థివ దేహం
- నివాళులర్పించిన మాజీ గవర్నర్ దత్తాత్రేయ
రంగారెడ్డి, ఆగస్టు 2 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి(18) ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ దేశానికి వెళ్లాడు. నుంచి ప్రమాదవశాత్తు ఆ దేశంలో అదృశ్యమై, ఆ తర్వాత హెల్సింకి సమీపంలోని సముద్రంలో శవమై తేలాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్చల అనంతరం మణిదీప్ రెడ్డి మృతదేహం హైదరాబాద్ లోని బీఎన్ రెడ్డి నగర్ కు చేరింది. విషయం తెలుసుకున్న వివిధ పార్టీల నాయకులు ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ కార్పొరేటర్ లచ్చిరెడ్డి తదితరులు మణిదీప్ రెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.






