టెన్త్ మండల్ టాపర్ రంగి శ్రీదీప్‌కు ఘన సన్మానం
నాగిరెడ్డిపేట్, మే 4 (విజయక్రాంతి): మండలంలోని చినూరు గ్రామానికి చెందిన రంగి శ్రీదీప్ టెన్త్ క్లాస్లో మండల్ టాపర్గా నిలిచిన సందర్భంగా రంగి శ్రీదీప్ను చినూర్ గ్రామ సర్పంచ్ మురళి గౌడ్,గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మురళి గౌడ్ మాట్లాడుతూ... తండ్రి మరణంతో కఠిన పరిస్థితుల్లోనూ విద్యపై దృష్టి కోల్పోకుండా విజయం సాధించడం ఎంతో అభినందనీయమనీ ఇలాంటి పట్టుదల,సంకల్పం ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందనన్నారు.
ఈ సందర్భంగా శ్రీదీప్ భవిష్యత్ చదువులకు పూర్తి అండగా ఉంటామని మురళి గౌడ్ హామీ ఇచ్చారు. శ్రీదీప్ సాధించిన విజయం చీనుర్ గ్రామానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరో హించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో, గ్రామ అధ్యక్షుడు గంపల వెంకన్న, కోడైరెక్టర్ మహేష్ రెడ్డి,ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మణ్ ఠాగూర్,గ్రామ కార్యదర్శి సరేందర్, మాల్తుమ్మెద సీడ్ ఫామ్ శాస్త్రవేత్తలు అనిల్ రెడ్డి, రేవంత్ నాదన్, మండల అధ్యక్షురాలు మాధవి, ఉప సర్పంచ్ సుకన్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేకల రామకృష్ణ, మామిళ్ళ నారాయణరెడ్డి, మేకల ప్రశాంత్, మేరిగే బోయిన సన్నీ, జయరాం, చింటూ తదితరులు పాల్గొన్నారు.






