ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు
15-04-2026 01:24 PM
దమ్మపేట,(విజయక్రాంతి): గత తొమ్మిది సంవత్సరాలుగా ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న భీమ్ జీ ఖమ్మం జిల్లా కోర్టుకు బదిలీ కావడంతో దమ్మపేట బార్ అసోసియేషన్ భీమ్ జీ ని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దమ్మపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గొంది మురళీమోహన్ మాట్లాడుతూ భీమ్ జీ సుదీర్ఘ కాలంగా అశ్వారావుపేట ఎక్సైజ్ స్టేషన్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.






