6 July, 2026 | 4:50 AM

వైభవంగా శ్రీబీరప్పస్వామి నూతన విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

06-07-2026 12:34 AM

పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

ఘట్ కేసర్, జూలై 5 (విజయక్రాంతి) : ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని మర్పల్లిగూడ లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీబీరప్ప ఆలయంలో ఆదివారం నూతన విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈవేడుకల్లో ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, స్థానిక ప్రముఖులు,  భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈసందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో శ్రీబీరప్పస్వామి ఆలయ నూతన విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరగడం చాలా సంతోషకరమని, ఆ స్వామివారి ఆశీస్సులు  ప్రజలందరిపై ఉండి, అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి మంద సంజీవరెడ్డి, పోచారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యానాయక్, బిజెపి జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ మాయ నరేష్, నాయకులు ఎదుగని కృష్ణమూర్తి, నాగులపల్లి రమేష్, పన్నాల కొండల్ రెడ్డి, బద్దం జగన్ మోహన్ రెడ్డి, మంకం రవి, చందుపట్ల ధర్మారెడ్డి, బొక్క విష్ణువర్ధన్ రెడ్డి,  సామల సందీప్ రెడ్డి, బొడిగె శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.