6 July, 2026 | 3:49 AM

యాదవులందరూ ఐక్యంగా ఉండాలి

06-07-2026 12:35 AM

మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

అబ్దుల్లాపూర్ మెట్, జులై 05: రాజకీయాలను పక్కనబెట్టి.. కుల విషయంలో యాదవులందరూ ఐక్యంగా ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యాదవుల విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో యాదవుల కోసం శ్రీకృష్ణ యాదవ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్మిస్తున్న యాదవ విజ్ఞాన కేంద్రం భూమి పూజ కార్యక్రమం ఆదివారం మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఎల్బీనగర్ జోన్, నాగోల్ సర్కిల్ పెద్ద అంబర్ పేట్ 52 డివిజన్ పరిధి కుంట్లూరులో  నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే  అంజయ్య యాదవ్, యాదవ కార్పొరేషన్ చైర్మన్  రఘునాథ్ యాదవ్, మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాజకీయాలను పక్కనపెట్టి యాదవులందరు ఐక్యంగా ఉండాలని సూచించారు.    దేశంలో రాష్ట్రంలో యాదవులకు రెండు ప్రత్యేక పండుగలు ఉన్నాయని ఒకటి సదర్ ఉత్సవాలు, మరొకటి శ్రీకృష్ణాష్టమని ఈ రెండు పండగలు యాదవులకు ప్రత్యేకమైన పండుగలని అన్నారు.  చలకాని శ్రీనివాస్ యాదవ్, ముక్కామల వెంకట్ యాదవ్,  చింతల రవీందర్ యాదవ్, నక్క శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ యాదవ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్, కరాటే కళ్యాణి, పలు ప్రాంతాల చెందిన యాదవ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.