30 April, 2026 | 2:20 AM

లారీలు రాక కదలని ధాన్యం బస్తాలు

30-04-2026 01:06 AM

ఆందోళనలో అన్నదాతలు

జనగామ, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. గత వారం రోజులుగా లారీలు రాకపోవడంతో జనగామ జిల్లా జిల్లా వ్యాప్తంగా తరిగొప్పుల, నర్మెట, చిల్పూర్, రఘునాథ్ పల్లి, స్టేషన్గన్పూర్, ధాన్యం నింపిన బస్తాలు వేలాది పైన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాలలో నిలిచిపోయాయి. 15 రోజుల నుంచి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి నిలువ చేశారు. వారి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారులు రైసు మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలతో వెళ్లిన లారీ అన్లోడ్ కావడానికి వారం రోజుల సమయం పడుతుంది.

జనగామ జిల్లా వ్యాప్తంగా మండలాల నుండి వెళ్లిన లారీ నేటి కూడా అన్లోడ్ కావడం లేదు వారం రోజులుగా తూకం వేసిన వందలాది ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రంలో పేరుకపోయాయి. లారీలు రాక ధాన్యం కదలక పోవడం అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తూకం వేసిన వందలాది బస్తాలు కేంద్రంలో నిల్వ ఉండడంతో వెయిట్ లాస్ అయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయగలరని రైతులు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.

చోద్యం చూస్తున్న సివిల్ సప్లై శాఖ అధికారులు జనగామ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకపోవడం వల్ల సుమారు వేలదిగా ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రానికి పరిమితమై ఉన్నాయి. ఇంకా వేలాది వడ్ల బస్తాల తూకం వేయాల్సి ఉంది. లారీలు రాకపోవడం కారణంగా గత వారం రోజుల నుండి కేంద్రాలలో ధాన్యం తూకాలు నిలిచిపోయాయి. లారీలు ఎప్పుడు వస్తాయో.. వడ్లను తూకం ఎప్పుడు వేస్తారో.. రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు మండుటెండలో నిరీక్షిస్తున్నారు. లారీలు రాకపోవడంతో కొనుగోలు నిలిచిపోయిందని. రైతులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సింగిల్ విండో సీఈఓ లు, ఐకెపి సిబ్బంది, జిల్లా సివిల్ సప్లై అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన కూడా స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

 అన్ని సెంటర్లలో లారీలను కేటాయించాం

జనగామ జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్లలో లారీలను కేటాయించమని పి పి సి లకు ట్యాగ్ చేయబడిన ట్రక్కుల నవీకరించబడిన. జాబితా లారీ డ్రైవర్లకు మరియు రవణ ట్రాక్టర్లతో సమన్వయం చేస్తున్నామని . ధాన్యం కొనుగోలను వేగవంతం చేస్తున్నామని. ఎప్పటికప్పుడు నింపిన ధాన్యం బస్తాలను పంపిస్తామని సివిల్ సప్లై అధికారి డిఎం హాథిరామ్ తెలిపారు. 

ఆరు రోజులుగా లారీ రాలేదు 

గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాను. ఆరు రోజులుగా లారీ రావడం లేదు ధాన్యం ఎండలో ఉండడంతో వెయిట్ లాస్ వచ్చే అవకాశం ఉందని. సకాలంలో లారీలు రాక రైస్ మిల్లర్లు వెయిట్ లాస్ పేరిట తరుగు తీస్తే సివిల్ సప్లై అధికారులు బాధ్యత వహిస్తారా తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం రైతు నీల సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు.