6 May, 2026 | 9:36 PM

Breaking News

కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •  

సర్పంచ్‌గా జీపీ ట్రాక్టర్ డ్రైవర్ పోటీ

03-12-2025 12:33 AM

-రిజర్వేషన్లతో పళ్లెం లింగంకు కలిసి వచ్చిన అవకాశం 

-మద్దతిచ్చిన అధికార పార్టీ నేతలు

-కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో ఘటన

కామారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): రిజర్వేషన్ల పు ణ్యమా అని గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తు న్న వ్యక్తికి సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం దక్కిన సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో చోటు చేసుకుంది. రిజ ర్వేషన్ల వల్ల రాజకీయాల్లో సముచిత స్థానం లభిస్తుందనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండలం పోసానిపేట పంచాయితీలో సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్ కు రిజర్వేషన్ కావడంతో జీపీ ట్రాక్టర్ డ్రైవర్ పళ్లెం లింగం పోటీ చేస్తున్నారు. లింగం గ్రామస్తులందరితో కలుపుగోలుగా ఉండడంతో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయనకు మద్దతిచ్చి సర్పంచ్‌గా నిలబడితే గెలుపు సునాయాసమవుతుందని గ్రామస్తులు భావించారు.

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి స్థానిక కాంగ్రెస్ నాయకులు జీపీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి పార్టీ మద్దతి ఇస్తే సర్పంచ్ గా సునాయాసంగా గెలుస్తారని చెప్పడంతో ఎమ్మెల్యే అందుకు సానుకూలంగా స్పందించారు. ఆయన ఎన్నికల్లో గెలుపొందితే సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.