6 May, 2026 | 10:29 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?

06-05-2026 09:35 PM

- మార్క్ఫెడ్ అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం

- కొనుగోలు పూర్తయ్యాక రైతులు ఇళ్ల వద్దకు వెళ్ళిపోవచ్చు

- ఎంపీ మల్లురవి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో భాగంగా రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కాంటావేసిన అనంతరం కూడా రైతులను మార్కెట్లోనే ఉండమని ఎవరు చెప్పారని మార్క్ఫెడ్ అధికారులను జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత రైతుకు మార్క్ఫెడ్, పిఎసిఎస్ నుండి మెసేజ్ వచ్చిన వెంటనే ఆకుప్ప, ఆ పంటతో రైతుకు సంబంధం లేదని రైతులు వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు.

అనవసరంగా రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని అధికారులను ఆదేశించారు.  బుధవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డును జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి తో పాటు ఎంపీ మల్లు రవి మార్కెట్ యార్డ్ ను సందర్శించారు. నేరుగా రైతులతో మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యాక కూడా నెల రోజులుగా ధాన్యం తరలించక పోవడంతో కుప్ప వద్దే పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ కాంట పూర్తయిన వెంటనే కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లేనని రైతులు తమ ఇళ్లల్లోకి వెళ్ళిపోవచ్చునని పేర్కొన్నారు. వర్షా బావ పరిస్థితి నుంచి పంటను కాపాడుకోవడం కోసం టార్పాలిన్లు ఏర్పాటు చేసుకోగా ధాన్యం తరలించే క్రమంలో వాటిని తిరిగి రైతులకు అప్పగించాలని మార్కెటింగ్, మార్క్ ఫెడ్ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు ఎవరు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రస్తుతం ఏర్పడ్డ అవాంతరాలన్నింటిని అధిగమిస్తూ ఆఖరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.

గతేడాది తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 94 వేల మెట్రిక్ టన్నులు ఇప్పటికే సేకరించినట్లు కేవలం నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డ్ పరిధిలోనే 25వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న సాగైన విషయాన్ని రైతులు గుర్తించాలని లారీల కొరత, హమాలీల కొరత గన్ని బ్యాగులు వంటి సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ అధిగమిస్తూ కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని అందుకు రైతులు కూడా సంయమనం పాటించాలని కలెక్టర్ కోరారు. ఎలాంటి సమస్య ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలని తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వారితోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు ఉన్నారు.