6 May, 2026 | 8:55 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

మేకలు అమ్మి నామినేషన్

03-12-2025 12:32 AM

-ప్రజాసేవ కోసమే నిర్ణయం

-కామారెడ్డి జిల్లా ఎండ్రియాల సర్పంచ్ అభ్యర్థి గంగయ్య

కామారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): సర్పంచ్‌గా పోటీ చేసి ప్రజాసేవ చేయాలని భావించిన ఓ మేకల యజమాని తనకున్న వాటిలో పదింటిని అమ్మి, ఆ డబ్బుతో సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం ఎండ్రియాల గ్రామానికి చెందిన మేకల కాపరి గంగయ్య సర్పంచ్‌గా పోటీ చేసి ప్రజా సేవ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.

అందుకోసమే తనకున్న మేకలలో 10 మేకలను అమ్మకానికి పెట్టాడు. మేకలను అమ్మగా రూ.50 వేలు వచ్చాయి. తన అనుచరులతో కలిసి మంగళవారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనతో పాటు వార్డు సభ్యులను బలపరచడానికి ఆఫిడవిట్లకు కూడా ఆయనే ఖర్చు పెట్టుకున్నారు. నామినేషన్ల కోసం డబ్బులు చెల్లించారు. సర్పంచ్ ఎన్నికల్లో గంగయ్య సంకల్పం నెరవేరుతుందా లేదా ఎన్నికల తర్వాత తెలియనుంది.