ఆయిల్ పామ్ సాగుతో మంచి లాభాలు
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
తాడ్వాయి మే 6 (విజయక్రాంతి): రైతులు ఆయిల్ ఫామ్ సాగుతో మంచి లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియాల గ్రామాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామ శివారులో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న బొక్క హన్మాండ్లు కు చెందిన ఆయిల్ ఫామ్ ను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతు హనుమాండ్ల తో మాట్లాడారు. దిగుబడి ఎలా వస్తుంది,ఆయిల్ ఫామ్ సాగు బాగుందా, దీనిపై మీ అభిప్రాయం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. రైతు మాట్లాడుతూ.. నాకు మంచి దిగుబడి వస్తుంది మంచి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు చేయడంతో ప్రభుత్వం సైతం ఎకరాకు రూ. 4,200 సబ్సిడీగా అందిస్తుందని రైతు తెలిపారు. ఎకరానికి ఆయిల్ ఫామ్ సాగుతో రూ. 1,20 లక్షల ఆదాయం వస్తుందని హనుమండ్లు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రైతు బొక్క హనుమండ్లు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ సాగును చూసి మిగతా రైతులు సైతం అనుకరించాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగు చేసుకుంటే మంచి ఆదాయం పొందవచ్చన్నారు. అనంతరం గ్రామంలో తాగునీటి సమస్యను పరిశీలించారు. గ్రామంలో ఉన్న మూడు ట్యాంకులలోకి నీళ్లు సక్రమంగా వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఎలా వస్తున్నాయి, ఏమైనా తాగునీటి ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో నీటి ఎద్దడి ఉంటే వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచించారు.తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం విధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం బాగుందన్నారు.ఎవరైతే ఒక కిలో ప్లాస్టిక్ వస్తువులు తీసుకువస్తే వారికి పాలకవర్గం స్టీల్ టిఫిన్ బాక్సులు అందించి ప్రోత్సహించడం ఇంకా బాగుంధన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రఘునందన్, తహసిల్దార్ శ్వేత,h ఎంఈఓ రామస్వామి, సర్పంచ్ నర్సింలు, వ్యవసాయ అధికారి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.






