ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కొత్తపల్లి, మే 6(విజయక్రాంతి):అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత మరియు వారిపై హిస్టరీ షీట్ట్లు నమోదు చేశామని కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు. బుధవారము రోజున ఉదయం సమయంలో బొమ్మకల్ శివారులో ఉన్న మానేరు వాగు నుండి ప్రభుత్వ అనుమతి లేకుండా మూడు ట్రాక్టర్లలో దొంగతనంగా ఇసుకను నింపుకొని వాటిని బొమ్మకల్ నుండి కరీంనగర్ కు తరలించుచుండగా అత్తాపురం విజయ్,
కాల్వ సాయి ప్రవీణ్,సిరిసిల్ల అజయ్ అనువారాలు నడుపుకుంటూ వచ్చుచుండగా పెట్రోలింగ్ చేయుచున్న పోలీసులు అట్టి ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి దొంగతనంగా ఇసుకను రవాణా చేస్తున్న మట్టి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసుకుని అట్టి ట్రాక్టర్లను జప్తు చేసి,కోర్టుకు పంపబడమైనదని, పదేపదే ఇసుక రవాణా చేస్తున్న కాల్వ సాయి ప్రణయ్ మరియు సిరిసిల్ల అజైలపై హిస్టరీ షీట్ల ఓపెన్ చేయడం జరిగిందనీ,మరల అట్టివారలు ఇసుక రవాణా చేసినట్లయితే వారిపై పిడియాక్ట్ నమోదు చేసుకొని జైలుకు పంపబతారని సి ఐ తెలియజేశారు.






