calender_icon.png 10 February, 2026 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసిడి, వెండి ధరలు పైపైకి

10-02-2026 12:00:00 AM

  1. ఒక్కరోజులోనే బంగారంపై 2వేలు, వెండి 11వేలు పెరుగుదల
  2. హైదరాబాద్‌లో గోల్డ్ ధర1.60 లక్షలు

హైదరాబాద్, ఫిబ్రవరి 9(విజయక్రాంతి): ఇటీవల భారీగా దిగొచ్చిన  బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో వెండి కిలో ధర మార్చి నెల కాంట్రాక్ట్ 4.74 శాతం మేర పెరిగి రూ. 2,61,745కి చేరింది.  10 గ్రాముల మేలిమి పసిడి ధర ఏప్రిల్ కాంట్రాక్ట్ 1.3 శాతం పెరిగి రూ.1,57,540కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ మళ్లీ 5 వేల డాలర్ల మార్కుకు పైగా పలుకుతోంది. 

సోమవారం ఔన్సు బంగారం 5004 డాలర్లు పలుకుతుండగా.. వెండి ఔన్సు 81 డాలర్ల వద్ద నడుస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో తులం బంగారం రూ.1.60 లక్షలు నడిసింది. వెండి ధర రూ.2.70 లక్షల పైనే పలికింది. బంగారం, వెండి ధరల్లో ఇటీవల భారీస్థాయిలో కుదుపు రావడానికి చైనా ట్రేడర్ల స్పెక్యులేటివ్ ట్రేడింగే కారణమని అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు.