10-02-2026 01:27:28 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 9(విజయక్రాంతి): సంస్థాగత వంటశాలలు, అనుబంధ సేవల్లో వృత్తిపరమైన, పరిశుభ్రమైన,క్రమశిక్షణ కలిగిన సిబ్బందిని తయారు చేసేందుకు హరేకృష్ణ మూమెంట్స్ చారిటబుల్ ఫౌండేషన్(హెచ్‌కేఎంసీఎఫ్), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ( వైఐఎస్‌యూ) చేతులు కలిపాయి. ఇందులో భాగంగా ‘సేవ విత్ స్కిల్’ అనే వినూత్న శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సోమవారం హైదరాబాద్‌లో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి.
ఈ కార్యక్రమంలో హరేకృష్ణ మూమెంట్స్ చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షులు సత్యగౌరచంద్రదాసప్రభు (ఎంటెక్, ఐఐటీ మద్రాస్), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ వీఎల్‌వీఎస్‌ఎస్ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ శిక్షణలో భాగంగా రెండు నెలల తరగతి గది అభ్యాసం, అనంతరం15 రోజుల పాటు ప్రాక్టికల్స్ శిక్షణ పాక్టికల్శిక్షణ ఉంటుంది. ఆహారభద్రత, టీమ్‌వర్క్, ఆర్థిక అక్షరాస్యత, సేవా దృక్పథంపై అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
క్రమశిక్షణ, వృత్తినైపుణ్యం, నైతికవిలువలను పెంపొందించడంతోపాటు సంస్థాగత సహాయ సేవల్లో నైపుణ్య అంతరాలను తగ్గించడం ఈభాగస్వామ్యం లక్ష్యంగాపెట్టుకుందని రెండు సంస్థల ప్రతినిధులుపేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతోపాటు, సామాజిక బాధ్యతను పెంపొందించేలారూపొందించిన ఈశిక్షణ కార్యక్రమం.. నైపుణ్యాభివృద్ధి రంగంలో ఒక ఆదర్శవంతమైన నమూనాగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తంచేశారు.
హరేకృష్ణ మూమెంట్స్ చారిటబుల్ ఫౌండేషన్ (హెచ్‌కేఎంసీఎఫ్) గురించి. చేసేందుకు హరేకృష్ణ మూమెంట్స్ చారిటబుల్ ఫౌండేషన్ ఒక లాభాపేక్షలేని సంస్థ. పెద్దఎత్తున ఆహారసేవలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆకలి, పోషకాహారలోపం, సామాజిక అసమానతలను తగ్గించేందుకు దేశవ్యాప్తంగా సేవలందిస్తోంది.