జీవో 7ను ఉపసంహరించుకోవాలి
05-05-2026 12:00 AM
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- గన్ పార్క్ వద్ద కాగడాల ప్రదర్శన
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి) : ఫీజు రియింబర్స్‌మెంట్‌కు సంబంధించిన ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టి, వారితో చెలగాటం ఆడవద్ద ని విజ్ఞప్తి చేశారు. ఫీజులు కట్టలేమని, ఫీజుల భారం తమపై మోపవద్దని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వా నికి స్పష్టత లేకుండా జీవో 7ను తీసుకొచ్చిందని, ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తి వేసే కుట్ర మానుకోవాలని సూచించారు.






