టీఆర్పీలోకి భారీగా చేరికలు
ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలానికి చెందిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేసి బుధవారం తెలంగాణ రాజ్యధికార పార్టీలో చేరారు. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బత్తుల కుమార స్వామి, రాష్ట్ర యువజన నాయకుడు కొమ్మినేని శరత్ పటేల్ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో చేరారు.
పార్టీలో చేరిన వారిలో బీఆర్‌ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు దికొండ బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ దీకొండ బాలరాజ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ లింగం యాదవ్ పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్ నాగోల్ ప్రాంతానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు టీఆర్పీలో చేరారు. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మీనా గౌడ్ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న సమక్షంలో చేరారు.






