5 May, 2026 | 6:45 AM

ఐఐఎస్సీతో నిమ్స్ ఏఐ భాగస్వామ్యం

05-05-2026 12:00 AM

పంజాగుట్ట, మే 4(విజయక్రాంతి): నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) పరిధిలోని ‘టాను’ (టీఏఎన్యుహెచ్) ఫౌండేషన్ ప్రతినిధులుఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిం చారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో కృత్రిమ మేధ సాంకేతికతను వైద్య రంగంలోకి తీసుకువచ్చి, రోగులకు మెరుగైన చికిత్స అందించే అంశంపై చర్చించారు. ఐఐఎస్సి ప్రతినిధులు కిడ్నీ ఆరోగ్యం, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అంచనా, డయాబెటిస్ నిర్వహణ వంటి విభాగాల్లో తాము అభివృద్ధి చేసిన ఏఐ టూల్స్‌ను ఈ సందర్భంగా ప్రదర్శించారు.

నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. భీరప్ప, డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఈ వినూత్న ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావే శంలో ఐఐఎస్సి, టాను ప్రతినిధులతో పా టు నిమ్స్ డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్, క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ పద్మ జ దుర్గ, పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ శాం తవీర్, నెఫ్రాలజీ విభాగాధిపతి భూషణ్ రాజు, జనరల్ మెడిసన్ విభాగాధిపతి డాక్ట ర్ సుబ్బలక్ష్మి, రేడియాలజీ విభాగం డాక్టర్ సుజాత పట్నాక్ తదితరులు పాల్గొన్నారు.