24 June, 2026 | 7:10 PM

యువతకు శుభవార్త.. వైద్యశాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్

24-06-2026 05:52 PM

ఖమ్మం హెల్త్, జూన్ 24 (విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీ)లో ఖాళీగా ఉన్న నాలుగు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. ల్యాబ్ టెక్నీషియన్ (ఎల్‌టీ) విభాగంలో మూడు పోస్టులు, సీనియర్ ట్యూబర్క్యులోసిస్ లాబొరేటరీ సూపర్వైజర్ (ఎస్‌టీఎల్‌ఎస్) విభాగంలో ఒక పోస్టును కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి తెలిపారు.

ఎల్‌టీ పోస్టుకు ఇంటర్మీడియట్‌తో పాటు డీఎంఎల్టీ అర్హత ఉండగా, ఎస్‌టీఎల్‌ఎస్ పోస్టుకు మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో డిగ్రీ లేదా డిప్లొమాతో పాటు కంప్యూటర్ కోర్సు, ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్, సంబంధిత అనుభవం తప్పనిసరి. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు, దరఖాస్తు ఫారాన్ని జిల్లా అధికారిక వెబ్‌సైట్ నుంచి పొందవచ్చని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో విద్యార్హతలు, అనుభవానికి వెయిటేజీ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.