24 May, 2026 | 1:04 AM

పాలిసెట్‌లో గీతాంజలి విద్యార్థుల ప్రతిభ

24-05-2026 12:18 AM

ఖమ్మం, మే 23 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 10 వ తరగతి విద్యార్థులకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్షలో ఖమ్మం శ్రీనివాస్ నగర్‌లోని గీతాంజలి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఈ ప్రవేశ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 98వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.

గీతాంజలి పాఠశాల విద్యార్థి పి.నవదీప్ ఎంబీఐపీసీ  విభాగంలో 116.5/120 మార్కులు సాధించి స్టేట్ 35వ ర్యాంకు, ఎంపీసీ విభాగం లో 118/120 మార్కులు సాధించి స్టేట్ 54వ ర్యాంకు సాధించాడు. ఎంబీఐపీసీ విభాగంలో వెయ్యిలోపు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు జే.సాత్విక్ 168 ర్యాంకు, ఎం.యశశ్విత 193 ర్యాంకు, ఎస్‌కే ఆసిఫ్ 304 ర్యాంకు, యూ.వేదశ్రీ 394 ర్యాంకు, ఎస్. శాన్విత 479 ర్యాంకు, సీహెచ్ వెంకటలక్ష్మి 533వ ర్యాంకు సాధించారు.

ఎంపీసీ విభాగంలో వెయ్యి లోపు రాష్ట్ర ర్యాంకులు సాధించిన విద్యార్థులు జే సాత్విక్ 338వ ర్యాంకు, ఎం.యశశ్విత 479వ ర్యాంకు, ఎస్.శాన్విత 523వ ర్యాంకు, ఎం. చరణ్ 537 వ ర్యాంకు, యూ వేదశ్రీ 598 వ ర్యాంకులు సాధించారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పారావు, డైరెక్టర్లు టీ పద్మ, టీ అరుణ్ ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.