ఎన్ఎంఎంఎస్ లో ప్రతిభ చూపిన గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు
05-06-2026 04:58 PM
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరచారు. ఇటీవల వెలువడిన ఎన్ ఎం ఎం ఎస్ లో 8వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు ఎనగందుల శ్రీవిద్య, పోతుగంటి సాయి వర్షిత, కుర్మా వెంకట్ ఋషి, ఎండి ఇర్ఫాన్ లను టీజీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ డా.గోల్డీ బల్బీర్ కౌర్ అభినందించారు. వీరికి సంవత్సరానికి 12 వేల రుపాయల చొప్పున 4 సంవత్సరాల వరకు 48,000/- రూపాయలు స్కాలర్ షిప్ రూపంలో అందజేయడంజరుగుతుందని శుక్రవారం తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.






